మిర్యాలగూడ బాలికల పాఠశాలలో ఘనంగా వనమహోత్సవం

ప్రజాలహరి  మిర్యాలగూడ;( హరిప్రసాద్ చీదళ్ళ)పట్టణంలోని 34వ వార్డు గాంధీ నగర్ గర్ల్స్ హైస్కూల్‌లో వన మహోత్సవం మరియు స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా – బాలకృష్ణ,వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నర్రా శ్రీజ రెడ్డి,34వ వార్డ్ కౌన్సిలర్ ధైధ స్వప్న, హాజరయ్యారు.వన మహోత్సవంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించే బాధ్యతను విద్యార్థులు తీసుకోవాలని సూచించారు.అనంతరం నిర్వహించిన ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.పర్యావరణ పరిరక్షణ మరియు స్వచ్ఛత విధానాలను విద్యార్థులు చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని, ఇల్లు మరియు పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు కావాలని ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, మున్సిపల్ అధికారులు, మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You May Have Missed