హాలియా మున్సిపాలిటీలో అర్హులైన 34 మంది లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాల అందజేత
ప్రజాలహరి హాలియా;హాలియా మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మొదటి విడతలో భాగంగా 34 మంది నూతన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ చింతల చంద్రారెడ్డి, కమిషనర్ కె.రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గౌని రాజా రమేష్ యాదవ్,2 వ వార్డు కౌన్సిలర్ నకిరేకంటి అన్నపూర్ణ సైదులు, 5 వ వార్డు కౌన్సిలర్ సలహాదారు చిట్టిపోలు కరుణాసాగర్,9 వ వార్డు కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు, కో ఆప్షన్ సభ్యులు, చెన్ను రాజేశ్వరి, వర్కాల శేఖర్ రెడ్డి,ఎండి రషీద్, హౌసింగ్ ఏఈ , లబ్ధిదారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, పేదలకు గృహవసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సురక్షితమైన గృహం అందించడం జరుగుతోందని తెలిపారు. ఇల్లు నిర్మాణం చేసుకునే క్రమంలో ఎక్కువ డబ్బులు వెచ్చించి ఆర్థిక ఇబ్బందుల్లో పడకూడదని సూచించారు. ఈ సమావేశానికి హాజరైన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వం మరియు చైర్మన్ కు, వైస్ చైర్మన్ కు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, మున్సిపాలిటీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



