మిర్యాలగూడ పట్టణంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా సాగుతున్నాయి.
ప్రజాలహరి మిర్యాలగూడ; వినాయకచవితి వేడుకల్లో భాగంగా ఈరోజు పట్టణంలోని పలు వార్డులలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను DCC ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్,సందర్శించారు మండపాల వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొని, లంబోదరుడికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించారు.అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలలో స్వయంగా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. వివిధ వార్డుల నిర్వాహకులు, స్థానిక ప్రజలతో కలిసి గణేశునికి అర్చనలు, హారతులు సమర్పించారు. స్వామివారి కృప అందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ, విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పలువురు నాయకులు, BLR బ్రదర్స్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, పాల్గొన్నారు.



