సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవో కు వినతి పత్రం సమర్పించిన బిజెపి నాయకులు

ప్రజాలహరి మిర్యాలగూడ;భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ వన్ టౌన్ ఆధ్వర్యంలో మిర్యాలగూడ ఆర్టీవో రమణారెడ్డి కి బిజెపి మిర్యాలగూడ వన్ టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బంటుగిరి కొంగరి వెంకటరమణ మూల రాజు రెడ్డిల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. నిజం నియంత అరాచక పాలనని అంతమొందిస్తూ భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలో సైనిక చర్య ద్వారా నిజాం మెడలు వంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రజలకు ఉపశమనం కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు రేపల్లె పురుషోత్తం రెడ్డి, అల్లం అశోక్, బిజెపి జిల్లా కార్యదర్శి చిల్లం చర్ల అభి, ఓ బి సి జిల్లా ఉపాధ్యక్షులు బంటు యాదగిరి, ఓబీసీ పట్టణ అధ్యక్షులు మండల సోములు, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు గోనె కవితా రెడ్డి, ఉపాధ్యక్షుడు ఓబీసీ పట్టణ మునగాల శివ, ఉపాధ్యక్షులుచిలుకూరి వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ చిలుకూరి శ్యాము, కౌన్సిలర్ వెలుగు ఇందిరా నాగరాజ్, కార్యవర్గ సభ్యుడు నాగరాజ్, రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ కంచుకొమ్ముల వేణు తదితరులు పాల్గొన్నారు

Previous post

బీసీ జేఏసీ మిర్యాలగూడ నాయకుల అక్రమ అరెస్టులు

Next post

నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు. జైవీర్ రెడ్డి ఆదేశాల మేరకు హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రివ్యూ మీటింగ్

You May Have Missed