బీసీ జేఏసీ మిర్యాలగూడ నాయకుల అక్రమ అరెస్టులు
ప్రజాలహరి మిర్యాలగూడ;కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరుగనున్న జాతీయ జనగణలో ఓబీసీ కులగణను చేపట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే హైదరాబాద్ చలో ఇందిరాపార్క్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష కార్యక్రమానికి ముందస్తుగా మిర్యాలగూడ పట్టణ బీసీ జేఏసీ నాయకులను ఉదయం ఇంటి వద్ద అదుపులోకి తీసుకోని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది .అక్రమ ముందస్తు అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అని బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వినర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. అక్రమ ముందస్తు అరెస్టులతో బీసీల ఉద్యమాన్ని ఆపలేరు అన్నారు. పోరాడితే పోయేదేమి లేదు -బానిస సంకెళ్లు తప్ప. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్షా జాతీ జనగణలో ఓబీసీ కులగణనను చేపట్టాలని ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కార్యక్రమం పిలుపు మేరకు మిర్యాలగూడ బీసీ జేఏసీ పట్టణ నాయకులను ముందస్తుగా ఆరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా మిర్యాలగూడ బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం లో ప్రశ్నించడమే సవాలుగా మారిందని, దీనికి తెలంగాణా రాష్ట్రకేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణనకు సంబంధించిన కేంద్రం ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14 వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ గెజిట్ లో 10 వ కాలంలో మీరు ఎస్సి నా ఎస్టీ నా ఇతరులు అని చేర్చి ఓబీసీలకు సంబంధించిన కాలం ప్రశ్న లేకపోవడం, ఓబీసీలను లెక్కించకపోవడం, బీజేపీ కేంద్రం ప్రభుత్వం చేస్తున్న అన్యాయం చాలా దుర్మార్గం అని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తరహాలోనే జనగణలో ఓబీసీ కాలం చేర్చి ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలన్నారు. బిజెపి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని హామీ ఇచ్చి ఈ సమయంలో స్పష్టంగా శాస్త్రీయంగా ఎదుటి నోటిఫికేషన్ జారీ చేసి అందులో 40 ప్రశ్నలు మీరు ఓబిసికి చెందిన వారిని మాత్రం అడగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. ఒక బీసీ ప్రధానిగా ఉన్నా బీసీలకు న్యాయం జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా బీసీ జాబితా ప్రకటించి కులాలకు ఒక కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు చాలా అన్యాయం జరుగుతుందన్నారు ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో బీసీ సమాజం ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాజం సమాధానం చెబుతామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం సవాలుగా మారిందని దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సోదరులందరు ఐకమత్యమై మన హక్కులను, మన రాజ్యాధికారం సాధించుకొని దక్కించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరెస్ట్ అయినా వారిలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య రజక, బిసి సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు బంటు కవిత, ఎస్సీ మహిళా జిల్లా కార్యదర్శి చిత్రం ఉమా, తదితరులు పాల్గొన్నారు.



