పట్టణ ఆర్యవైశ్య ముందస్తు కార్యాచరణ ప్రణాళిక కు సన్నద్ధమవుతున్న గౌరవ పెద్దలు

ప్రజాలహరి మిర్యాలగూడ ;మిర్యాలగూడ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన స్థిరాస్తుల విషయంపై అతి త్వరలో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో కులం కుశంగా విషయాన్ని చర్చించి ఒక నిర్ణయానికి రావాలని, మరియు పాత తరం విషయాలపై పూర్తి అవగాహన ఉన్న పెద్దలు నాయకులు అయిన చిల్లంచర్ల విజయ్ కుమార్ గారి అనుమతితో వారి సమక్షంలో ఒక సమావేశాన్ని నిర్వహించాలనే ప్రయత్నిస్తున్నట్లు తిరునగరు భార్గవ ఒక ప్రకటనలో తెలిపారు. విజయ్ కుమార్ గారు ఆర్యవైశ్యులలో పాత మరియు కొత్త తరాల విషయాల గురించి అవగాహన ఉన్నవారుగా అందరికీ సుపరిచితం కావడం చేత ఈ సమావేశానికి వారిని ఆహ్వానించి వారి సలహాలను సూచనలను తీసుకుని ముందుకు సాగాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆర్యవైశ్యుల స్థిరాస్తులను మరియు సాంప్రదాయాలను కాపాడుకోవడం పై వారి వారి బాధ్యతలను గుర్తు చేస్తూ,పట్టణ ప్రముఖులు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తమ సలహాలను భవిష్యత్తు కార్యాచరణను ముందు తరాలకు తెలుపవలసిందిగా కోరనున్నట్లు తెలిపారు. ఒక పథకం ప్రకారం ముందుకు సాగవలసిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక తేదీని సమయాన్ని మరియూ వేదికను త్వరలో తెలియపరచగలమని చెప్పారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు తిరునగరు భార్గవ, ప్రధాన కార్యదర్శి లకుమారపు పాండురంగయ్య గారు కార్యదర్శి చిల్లంచర్ల శ్రీనివాస్ గారు కోశాధికారి అల్లాని రమేష్ గారు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడ 41 వ వార్డు ఎన్ఎస్వి క్యాంపు పరిధిలోని ఓటరు సవరణ మరియు నమోదు కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలి; మున్సిపల్ వైస్ చైర్మన్

Next post

బీసీ జేఏసీ మిర్యాలగూడ నాయకుల అక్రమ అరెస్టులు

You May Have Missed