మిర్యాలగూడ 41 వ వార్డు ఎన్ఎస్వి క్యాంపు పరిధిలోని ఓటరు సవరణ మరియు నమోదు కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలి; మున్సిపల్ వైస్ చైర్మన్
ప్రజాలహరి మిర్యాలగూడ; మిర్యాలగూడ పట్టణంలోని 41వ వార్డు NSP క్యాంప్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న బి.ఎల్.ఓ (BLO)లు మరియు ఓటర్లు వెంటనే క్రింది ఆదేశాలను పాటించగలరని. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష – నవీన్ కుమార్ గారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధారాల (Proofs) అప్‌లోడ్: హేరింగ్ (Hearing) పూర్తయిన ఓటర్లకు సంబంధించి ఇంకా అప్‌లోడ్ చేయని బకాయి ప్రూఫ్‌లన్నింటినీ బి.ఎల్.ఓలు ఈరోజు తప్పనిసరిగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.ఇప్పటివరకు ఫారం-6 (కొత్త ఓటరు నమోదు) అందించని వారు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను (Proofs) సేకరించి ఈరోజే అధికారులకు అందజేయాల్సి ఉంటుంది అని అన్నారు. సమయపరిమితి ముగియకముందే సంబంధిత అధికారులు మరియు ఓటర్లు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయగలరని వారు కోరారు.ఈ కార్యక్రమంలో BLO లు, అంగన్వాడీ సిబ్బంది, వార్డ్ ప్రజలు, BLR బ్రదర్స్, తదితరులు పాల్గొన్నారు.



