బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మకు ఘన నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దోపిడి అణచి వేతకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి, భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కొరకు పోరాటం చేసిన యోధురాలు, తెలంగాణ పోరాట వీర వనిత, శ్రీ చాకలి చిట్యాల ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బండు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాలలతో ఘనమైన నివాళులు అర్పించారు. వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్బంగా ఐలమ్మ స్ఫూర్తిని ఆ మహనీయురాలి ఆశయ సాధన కొరకు ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని నడుంబిగించి పాటుపడుతూ కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగనకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆగస్టు 14వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ గెజిట్లో పదవ కాలంలో మీరు ఎస్సి నా ఎస్టీ నా ఇతరులని చేర్చి ఓబీసీలకు సంబంధించిన కాలం లేకపోవడం, ఓ బీసీలను లెక్కించకపోవడం, మోసం చేస్తున్న బిజెపి ప్రభుత్వం చాలా అన్యాయం సిగ్గుచేటు దుర్మార్గం.              తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ని బకాయిలన్నింటిని వెంటనే విడుదల చేయాలి. స్థానిక మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్ పేటలోని ఐలమ్మ విగ్రహానికి బీసీ జేఏసీ మిర్యాలగూడ పట్టణ కన్వీనర్ బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ మాట్లాడుతూ భూస్వామ్య దోపిడీ అణచివేత అన్యాయానికి ఎదురు నిలిచిన, తెలంగాణ పోరాట వీరవనిత సామాన్య పేద రజక కుటుంబంలో పుట్టిన చాకలి ఐలమ్మ చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఇప్పటికీ అన్యాయానికి తలవంచకుండా హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఆ కాలంలో తెలంగాణలో ధరలు భూస్వాముల ఆధిపత్యం కారణంగా పేద రైతులకు కూలీలు బడుగు బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వెట్టి చాకిరి, అధిక పనులు, భూములపై పెత్తనం వంటి దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఐలమ్మ పోరాటం కీలకపాత్ర పోషించిందని అన్నారు. తన భూమి హక్కును కాపాడుకోవడానికి భూస్వామ్య శక్తులను ఎదురునుంచి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ. తెలంగాణ ప్రజలకు నూతన స్ఫూర్తిని తెగవను అందించిందన్నారు. ఇక సాధారణ మహిళగా ఉన్నప్పటికీ ఆ కాలంలోని బలమైన భూస్వామ్య వ్యవస్థను ఎదిరించి నిలవడం ధైర్యసాహసాలకు నిదర్శనం అన్నారు. ఐలమ్మ పోరాటం మహిళలకు ప్రత్యేకమైన స్ఫూర్తిని అందించిందని బంటు వెంకటేశ్వర్లు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వీర నారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఆమె పోరాట స్ఫూర్తిని ఆ మహానీయురాలికి ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు ఆదర్శంగా నడుంబించి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు యర్రబెల్లి దుర్గయ్య, రజక బీసీ యువజన నాయకులు తుపాకుల తుకారాం రజక, తాడూరి సైదులు రజక, యర్రబెల్లి వెంకన్న రజక, సామాజికవేత్త ఉద్యమకారుడు ఎండి మహమ్మద్ కొత్తగూడెం,తదితరులు పాల్గొన్నారు

You May Have Missed