హాలియాలో ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ 

ప్రజాలహరి (హాలియా);రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా, హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు యూనిఫాం మరియు షూస్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హాలియా మున్సిపల్ చైర్మన్ శ్రీ చింతల చంద్రరెడ్డి మరియు వైస్ చైర్మన్ శ్రీ గౌని రాజ రమేష్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు యూనిఫామ్‌లు, షూస్‌లను అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకుని చదువులో రాణించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బొంగరాల యేసు రాజు , కౌన్సిలర్ చెరుపల్లి ముత్యాలు , కౌన్సిలర్ సలహాదారులు నకిరేకంటి సైదులు , మజహార్ మొయినుద్దీన్ , చిట్టిపోలు కరుణాసాగర్ , గడ్డం రమణయ్య , కుకడాల ఆంజనేయులు , మద్దిమడుగు కిషోర్ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయపాల్ రెడ్డి బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Previous post

కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీల అమలుపై ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాల సమర్పణ 

Next post

అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించడం దుర్మార్గం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే: నల్లమోతు భాస్కర్ రావు 

You May Have Missed