రంజాన్ సందర్భంగా రైస్ మిల్లర్స్ సేవలు ప్రశంసనీయం.

‘మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్’ సేవలు అజరామరం

* సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్యవైశ్యులే మార్గదర్శి

* రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కిట్ల పంపిణి అభినందనీయం

*యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి : హమీద్ షేక్

 

#మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సేవలు అజరామరం అని నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ పేర్కొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్యవైశ్యులే మార్గదర్శి అని కొనియాడారు. రంజాన్ పండుగ సందర్భంగా పలు ముస్లిం కుటుంబాలకు హమీద్ షేక్ చేతుల మీదుగా రైస్ మిల్లర్లు రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో హమీద్ షేక్ మాట్లాడారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు మానవత్వానికి, దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారని కొనియాడారు. సర్వమత సమానత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రతి ఏడాది పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం కుటుంబాలకు తమ వంతుగా సాయమందిస్తున్నారని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పలు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకున్నారని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో సహృద్భావంతో, సేవానిరతితో అనేక మంది యువతలో ఆర్యవైశ్యులు స్ఫూర్తి నింపారని అన్నారు. తాజాగా, పలు ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్లను పంపిణీ చేశారని చెప్పారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పాలకమండలి తరఫున హమీద్ షేక్ ముస్లిం సోదరసోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో ప్రతీ ఒక్కరూ నెలరోజుల పాటు రంజాన్ ఉపవాస దీక్షలను చేపట్టాలని, ప్రపంచ శాంతి కోసం అల్లాను ప్రార్ధించాలని కోరారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు శక్తివంచన లేకుండా సాయం అందించేందుకు దాతలు, స్వచ్చంద సంస్థలు, ఎన్నారైలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని హమీద్ షేక్ పిలుపునిచ్చారు. రంజాన్ కిట్ల పంపిణీ అనంతరం తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్

మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గోళ్ళరామ్ శేఖర్,

కార్యదర్శి బాబీ, పోలిశెట్టి ధనుంజయ, కోశాధికారి గందె రాముకు హమీద్ షేక్ హార్థిక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రషీద్, ముర్తుజా, హాజీ, తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed