వరద లేకున్నా వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా జలాలు వెళుతున్నాయి కండ్లకు గంతలు కట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. కేటీఆర్

⭐వరద లేకున్నా వెలిగొండప్రాజెక్టుకు కృష్ణా జలాలు వెళుతున్నాయి. కళ్ళు మూసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు కేసు భయపడుతున్న రేవంత్ రెడ్డి…

…..⭐రైస్ బోల్ ఆఫ్ తెలంగాణలోనే పంటలు ఎండిపోతున్నాయి… మిర్యాలగూడ ప్రజాలహరి.. నాగార్జునసాగర్ ఎడమ కాలు ప్రాజెక్టు పరిధిలో

నీటి విడుదల లో సరైన నిర్ణయం తీసుకోకపోవడం అన్న సమస్య వేల ఎకరాలు పంటలు ఎండిపోతున్నాయి అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈరోజు రైతు ధర్నా పాల్గొన్నారు. ముందుగా నార్కెట్పల్లి అద్దంకి హైవే నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల పై పూర్తి అవగాహన లేదు. రైతుల అవసరాలను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అన్ని మేజర్లకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇవ్వకుంటే సెప్టెంబర్ 14 గురించి కోదాడ_హాలియా వరకు ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో పంట ఎండిపోవడం అనేది జరగలేదని తెలిపారు. దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం వలన రైతులు ఏరియా కోసం క్యూ లైన్ లలో నిలబడాల్సి వస్తుందని చెప్పారు. యాప్ లో పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. రైతు భరోసా, కౌలు రైతులకు చెల్లింపు లేవు. వ్యవసాయ కూలీలకు 12,000 అడ్రస్ లేదు చెప్పారు. రైతు బీమా, రైతు భరోసా రైతు పథకాలను అమలు చేయలేకపోయినా పనికిరాని దరిద్రపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. రక్త పిశాచి లాంటి ముఖ్యమంత్రి పాలనలో వర్షాలు పడవని విమర్శించారు కాంగ్రెస్ వాళ్లలో చిక్కుకొని రైతులు విల విలలాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం సాగర్లో నీళ్లు ఉన్నాయి కానీ నీళ్లు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా మంత్రులు మేల్కొని రైతుల పొలాలకు నీళ్లు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ రైతులను ఆదుకోటమే తమ లక్ష్యమని వారి కోసమే ఈ మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని రైతులెక్కడ పచ్చగా ఉంటారో అక్కడ లక్ష్మీ ఉంటుందని తెలిపారు. సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు పరిధిలోని అన్ని మేజర్లకు పూర్తిస్థాయిలో నీటి విడుదల చేసి చెరువుల నింపాలి ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, రవీందర్ నాయక్, కంచర్ల భూపాల్ రెడ్డి తిప్పన్న విజయ సింహ రెడ్డి, బి నాయకులు జొన్నలగడ్డ రంగారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, నల్లమోతు సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed