పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా కేటీఆర్

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తాం ✊

 

విద్యార్థులకు భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మిర్యాలగూడ  ప్రజాలహరి

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో అత్యంత ప్రాధాన్యంతో ప్రస్తావిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.

 

మిర్యాలగూడ సభకు వెళ్తున్న కేటీఆర్ గారిని ఎంజీ యూనివర్సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థులు కలిసి తమ సమస్యలను విన్నవించారు.

 

పాలిటెక్నిక్ కళాశాలల భూములు, విద్యా సంస్థల భవిష్యత్తు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలను విద్యార్థులు కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

 

తమ సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సిన అవసరం ఉందని వారు కోరారు.

 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…

 

♦️సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను టాప్ ప్రయారిటీగా తీసుకుంటామని తెలిపారు.

 

♦️ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చే వరకు, సమస్యపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

 

♦️పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్న ప్రాంతాల్లోని విలువైన భూములపై ప్రభుత్వ దృష్టి ఉందనే ఆందోళనను కూడా కేటీఆర్ ప్రస్తావించారు.

 

♦️విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

 

♦️జర్మనీ తరహాలో చదువుతోపాటు పని అనుభవం పొందే డ్యూయల్ ప్రోగ్రామ్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ప్రాక్టీస్ స్కూల్స్ వంటి విధానాలను అమలు చేసే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.

 

♦️విద్యార్థులకు మెరుగైన సాంకేతిక నైపుణ్యాలు అందించే విధానాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

 

♦️విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా మాట్లాడుతుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Previous post

KTR రైతు మహా ధర్నాకు వ్యతిరేకంగా మిర్యాలగూడలో భారీ నిరసన ర్యాలీ 10 ఏళ్ల BRS పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ.. 1000 రోజుల కాంగ్రెస్ ప్రజా పాలన సంక్షేమాన్ని చాటుతూ ప్లేకార్డులతో నిరసన

Next post

వరద లేకున్నా వెలిగొండ ప్రాజెక్టు కృష్ణా జలాలు వెళుతున్నాయి కండ్లకు గంతలు కట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. కేటీఆర్

You May Have Missed