KTR రైతు మహా ధర్నాకు వ్యతిరేకంగా మిర్యాలగూడలో భారీ నిరసన ర్యాలీ 10 ఏళ్ల BRS పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ.. 1000 రోజుల కాంగ్రెస్ ప్రజా పాలన సంక్షేమాన్ని చాటుతూ ప్లేకార్డులతో నిరసన

ప్రజాలహరి మిర్యాలగూడ: మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో… ‌KTR నిర్వహిస్తున్న రైతు మహా ధర్నాకు వ్యతిరేకంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు…ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్లేకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ నినాదాలు చేశారు…అదే సమయంలో గత 10 ఏళ్ల BRS పాలనలో చోటుచేసుకున్న అవినీతి, రైతుల పట్ల నిర్లక్ష్యం, వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ.. గత పదేళ్ల BRS పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోకుండా, రైతులకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైన KTR.. ఇప్పుడు రైతుల సమస్యలపై మహా ధర్నా అంటూ రాజకీయ నాటకాలకు తెరలేపడం విడ్డూరంగా ఉందని విమర్శించారు… రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తోందని తెలిపారు. రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు…గత పాలనలో రైతులకు జరిగిన అన్యాయాలను ప్రజలు మరచిపోలేదని, పదేళ్ల BRS పాలనలో రైతుల కోసం ఏమి చేశారో KTR ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని BLR సూచించారు… కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత విస్తృతంగా వివరించి, బూటకపు రాజకీయాలను ప్రజల్లో ఎండగడతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు… ఈ నిరసన ర్యాలీలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు…

Previous post

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన సందర్భంగా నెరవేర్చని ఆరు గ్యారెంటీలు 420 హామీలనుద్దేశించి హాలియాలో భారీ ర్యాలీ

Next post

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా కేటీఆర్

You May Have Missed