వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా మహానేతకు ఘన నివాళులు
ప్రజాలహరి మిర్యాలగూడ;కొండ్రపోల్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కొండ్రపోల్ గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేష కృషి చేసిన మహానేత అని అన్నారు…ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు…వైఎస్సార్ గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ప్రజల కోసం వైఎస్సార్ చూపిన సేవా మార్గాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు…



