నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (DCCB) – మిర్యాలగూడ-2 నూతన బ్రాంచ్ ప్రారంభం
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ పట్టణంలో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (DCCB) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిర్యాలగూడ-2 నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు…ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR రిబ్బన్ కట్ చేసి నూతన బ్రాంచ్‌ను అధికారికంగా ప్రారంభించారు… అనంతరం బ్యాంకు సిబ్బందితో కలిసి బ్రాంచ్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సహకార బ్యాంకుల ద్వారా రైతులు, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు మరియు సామాన్య ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు… మిర్యాలగూడ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంలో నూతన బ్రాంచ్ కీలకంగా నిలుస్తుందని తెలిపారు…ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు, రైతులు మరియు గ్రామీణ ప్రజలకు ఆర్థికంగా మరింత అండగా నిలవాలని బ్యాంకు అధికారులను కోరారు… ఈ కార్యక్రమంలో MLC శంకర్ నాయక్ , డీసీసీ జెనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ , కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్ , బ్యాంకు అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఖాతాదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు…



