అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్  ప్రభుత్వం నిరుపేదల కోసం కేటాయించిన ఉచిత బియ్యం పథకాన్ని కొందరు దుర్మార్గులు తక్కువ ధర కుకొని పక్కదారి పట్టిస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ పోలీసులకు అందిన సమాచారం మేరకు మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామం శివారు లో గల శ్రీ లక్ష్మీ గణపతి ఆగ్రో ప్రొడక్ట్స్ రైస్ మిల్లు వద్ద జరిపిన తనిఖీలలో 21 టన్నుల అనగా 420 సంచులు పిడిఎస్ బియ్యం అక్రమంగా నిలువ చేసి రైస్ మిల్ కు తరలించి పాలిష్ చేసి ఇతర బస్తాలలో ప్యాక్ చేసి విక్రయించేందుకు నిలువ ఉంచిన బియ్యాన్ని మరియు మినీ డీసీఎం వాహనాన్ని రూరల్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.  నిందితులు సోమా రామకృష్ణ, చిమ్మట వెంకన్న, చిమ్మట లోకేష్, సయ్యద్ నదీమ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మరియు సోమ రామకృష్ణ పై గతంలో వివిధ స్టేషన్ల పరిధిలో 13 కేసులు నమోదు అయినట్లు దర్యాప్తులో తెలింది. పేదలకు చెందిన పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం నిల్వ ఉంచడం దుర్వినియోగం చేయడం నేరమని అట్టి వారిపై కఠిన శిక్షలు తప్పవని మరియు ఈ కేసుకు సంబంధించిన మరికొందరు వ్యక్తులపై దర్యాప్తు కొనసాగుతుందని రూరల్ పోలీసులు తెలిపారు

You May Have Missed