పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ నియోజకవర్గంలో అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పేర్కొన్నారు… మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామంలో, అలాగే దామరచర్ల మండలం రాళ్లవాగు తండా గ్రామంలో నూతనంగా నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు…ఈ సందర్భంగా నూతన గృహాలను పరిశీలించి, లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి, వారికి నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలియజేశారు…సొంతింటి కల నెరవేరిన లబ్ధిదారుల ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే BLR మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు…నియోజకవర్గంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని అన్నారు…ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరిగేలా అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామస్థులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…



