శెట్టిపాలెంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ప్రజాలహరి వేములపల్లి;వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ,మరియు RDO రమణా రెడ్డి , MRO, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సమర్థవంతంగా అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు…
స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సులభతరంగా సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు…ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో RDO రమణా రెడ్డి , MRO , ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…



