భూ నిర్వాసితులకు రూ.కోటి విలువైన పరిహారం చెక్కుల పంపిణీ
ప్రజాలహరి మిర్యాలగూడ;అడవిదేవులపల్లి మండలంలో నిర్మిస్తున్న దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పరిహారంలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 30 మంది భూ నిర్వాసితులకు మొత్తం రూ.కోటి విలువైన పరిహారం చెక్కులను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) , RDO రమణారెడ్డి కలిసి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (BLR) మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల కోసం భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల ప్రయోజనాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా పరిగణిస్తోందన్నారు… భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి న్యాయమైన పరిహారం అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో సాగునీటి సౌకర్యాలు మరింత మెరుగుపడి, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు… ప్రాజెక్టు నిర్మాణంతో పాటు భూ నిర్వాసితుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు… భూ నిర్వాసితులకు పరిహారం అందించే ప్రక్రియను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్న అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు…అర్హులైన ప్రతి భూ నిర్వాసితుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు కొనసాగుతాయని తెలిపారు… ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు…



