గిరిజన విద్యార్థి సంఘం నిరాహార దీక్షలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ప్రజాలహరి మిర్యాలగూడ: గిరిజన విద్యార్థి సంఘం, L.H.P.S సంఘాల ఆధ్వర్యంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు హాజరై సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ BC, SC, ST విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే SC, ST బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, BC, SC, ST హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి, విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా కల్పించాలని నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. విద్యార్థి సంఘాలు చేపడుతున్న న్యాయమైన పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంఘం నాయకులు, L.H.P.S సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



