కటింగ్ షాపుల బంద్ విజయవంతం రేట్ల పట్టిక పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్
ప్రజాలహరి మిర్యాలగూడ;స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని రేట్లు పెరుగుదల పై కటింగ్ షాపుల బందు ను నాయి బ్రాహ్మణులు శనివారం సంపూర్ణంగా బందు చేయడం జరిగిందని పట్టణ అధ్యక్షుడు రాయించు నరసింహ అన్నారు. అనంతరం పట్టణంలోని చింతపల్లి బైపాస్ రోడ్ లో గల నూతన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ఆలగడప గిరిధర్ హాజరై సంఘ సభ్యులతో కలిసి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అందరూ కలిసికట్టుగా ఉంటే సాధించలేనిది ఏది ఉండదని,సంఘ సభ్యులు సూచించిన రేట్ల ప్రకారం ప్రతి ఒక్కరు తీసుకోవాలని సంఘం యొక్క నియమ నిబంధన ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. అనంతరం రేట్ల పట్టిక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గౌరవఅధ్యక్షులు,మాజీ అధ్యక్షులు, జిల్లా సంఘ సభ్యులు,సీనియర్ సంఘ సభ్యులు, కోశాధికారి,కార్యదర్శి పట్టణ సర్వ సభ్యులు, నాయి బ్రాహ్మణ సోదరులందరూ పాల్గొన్నారు.



