స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;నల్గొండ జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు… ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూర్ రఘువీర్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR , నల్గొండ జిల్లాకు చెందిన పలువురు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు… ఈ సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR , మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఎంపీ కుందూర్ రఘువీర్ రెడ్డి తో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని, స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా, సులభంగా పౌర సరఫరాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు .లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR తెలిపారు..ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గం అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

Previous post

ఈ దేశ పురోగతికి కమ్యూనిస్టు ఉద్యమాలే కీలకం  కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి గారి 45 వర్ధంతి సభలో డబ్బికార్ మల్లేష్ సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు

Next post

హాలియ అగ్రోస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న 

You May Have Missed