యాదగిరి పల్లి పందిళ్ళపల్లి చెరువుకు ఫీడల్ ఛానల్ ఏర్పాటు చేయాలి;  బంటు…………

ప్రజాలహరి మిర్యాలగూడ;తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో గారికి మెమోరండం ఇవ్వటం జరిగింది  ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  యాద్గారి పెళ్లి పందిళ్ళపల్లి చెరువు లో రోజు రోజుకు నీటిమట్టం తగ్గిపోతున్నాయి . దాని వలన చుట్టూ ప్రక్కల గ్రామాలు ఎటు 10 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయని వారన్నారు దానితోపాటు ఇండ్లలో ఉన్న బోర్లు కూడా పొలాల్లో ఉన్న బోర్లలొ నీరు తగ్గడం వలన బోర్లు ఆగి ఆగి నీరు పోస్తున్నాయని వారన్నారు. యాదగిరి పెల్లి ,పందిళ్ళపల్లి చెరువుకు నాగర్జున సాగర్ ఎడమ కాలువకు గతంలో ఏడు కోట్ల తండా పక్కనుండి సాగునీరు వచ్చేటప్పుడు ఆ చెరువు నిండేదని ఇవ్వాళ ఆ ప్రాంతం మొత్తం రియల్ ఎస్టేట్ చేసి వ్యవసాయ భూములు మొత్తం ఇల్లు నిర్మించుకున్నారని రామచంద్ర గూడెం చైతన్య నగర్ రామ్ నగర్ తాళ్లగడ్డ ఈ వ్యవసాయ భూములు మొత్తం ఇండ్లుగా మారిపోయినాయి. ఇప్పుడు అక్కడ నుంచి నీరు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నేరుగా సాగర్ ఎడమకాలువ ద్వారా యాద్గారి పెల్లి పందిళ్ల పెల్లి చెరువుకు ఫీడల్ చానల్ ఏర్పాటు చేసి అన్ని చెరువులతోపాటు ఈ చెరువును కూడా నింపవలసిన బాధ్యత అధికారుల పైన ఉందని వారన్నారు. 20.రోజుల క్రితం తాగునీరు కోసం పాలేరు చెరువు నింపుటకు క్రిందికి నీటిని తీసుకొని పోయినారు. పీడల్ చానల్ లేకనే ఈ చెరువులోకి నీటిని వదలలేదు, ముఖ్యముగా అధికారులు చొరవ తీసుకొని వస్తున్నటువంటి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన ఫీడల్ ఛానల్ వేసి చెరువు లో నీటిని నింపాలని, లేనిపక్షంలో చెరువు కింద ఉన్నటువంటి రైతులను అదేవిధంగా చుట్టుపక్కల నుండి ప్రజలను కలుపుకొని పెద్ద ఎత్తున రైతు సంఘం ఆధ్వర్యంలోఆందోళన చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల కార్యదర్శి జిల్లా యాదగిరి యువజన సమాఖ్య నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు. బస్కర్ల పరమేష్, ఆకారపులోకేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా యశ్వంత్, మట్టయ్య, రాములు, శ్రీనివాసు, లింగయ్య, వెంకన్న ,తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed