ఉచిత హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
వేములపల్లి ప్రజాలహరి..
ఈరోజు వేములపల్లి మండలం ఆమనగళ్లు గ్రామంలో *లయన్స్ క్లబ్ సూర్యాపేట* వారి ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో నిర్వహించిన *ఉచిత హెల్త్ క్యాంప్ లో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి * సర్పంచ్ *సందీప్ కుమార్ ..
హెల్త్ క్యాంప్ ప్రారంభించి హెల్త్ క్యాంప్ కి విచ్చేసిన గ్రామస్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడం జరిగింది..
ఈ సందర్భంగా *MLA * మాట్లాడుతూ గ్రామాలలో హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామస్థులకు వైద్య సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ వారిని, యశోద హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..



