;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పాదయాత్రలో ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగినది
ప్రజాలహరి మిర్యాలగూడ;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పాదయాత్రలో ప్రచార యాత్రలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడం జరిగినది
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్రంలో బిజెపి పాలన అస్తవ్యస్తంగావటంతో సిపిఐ పార్టీ ప్రజా పోరాటాల వైపు ప్రజలని మమేకం చేసేందుకే పాదయాత్రలు ప్రచార జాతాలు కొనసాగిస్తున్నామని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిత్యవసర వస్తువులు ధరలు పెరగడం వలన అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని వారన్నారు. ఇవ్వాల స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేయకుండా భారతదేశంలో రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో బిజెపి ప్రభుత్వం చెప్పాలని సందర్భంగా వారు అన్నారు రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ధర చట్టబద్ధత కూడా కల్పించలేకుండా పోతుందని వెంటనే చట్టబద్ధత కల్పించాలని వారన్నారు రైతులు పొలంలో చల్లి ఎరువుల ధరలు ఒక బస్తాకు 600 రూపాయల నుండి 800 రూపాయల వరకు ధర.పెరిగిందని దానివలన రైతులు వ్యవసాయానికి దూరమయ్యే పరిస్థితి అవుపడుతుందని వారన్నారు ఒకవైపు ఈ దేశానికి రైతు వెన్నుముకని రైతు ఏడిస్తేనే రాజ్యం ఏడుస్తుందని ప్రగల్బాలు చెప్పే నాయకులు ఇవాళ రైతు పరిస్థితి అగమ్య గోచరముగా ఉందని వారన్నారు. ఒకవైపు 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లుగా విభజించి కార్మికుల బ్రతుకులతో చలగాటాలాడుతుందని ఈ చట్టాల వలన కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం కలిగే విధంగా ఉన్నాయి తప్ప కార్మికులకు రైతులకు ఉపయోగపడే విధంగా లేవని వారన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన కానుండి అన్ని వర్గాల ప్రజలు కార్మికులు, రైతులు ఆందోళన చెందుతున్నారని వారన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేస్తామని వారు అన్నారు ఈ పాదయాత్రలు మండల కార్యదర్శిలు అంజ నపల్లి రామలింగం జిల్లా యాదగిరి పోలేపల్లి విజయ్ కుమార్ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ధీరావత్ లింగా నాయక్, సాలె జగన్, ప్రజానాట్యమండలి నాయకులు వెన్నెల వెంకన్న, కలకొండశ్రీను, వంగూర్ శీను, మహిళా సమైక్య నాయకురాలు దాసర్లదుర్గమ్మ, ఎర్రబోతు పద్మ, ఎస్కే షమీం, డి శాంతి, లింగంపల్లి సైదమ్మ, జమ్ముల కోటయ్య, లక్ష్మయ్య ,ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు బస్కర్ల పరమేష్,ఏఐఎస్ఎఫ్ నాయకులు జిల్లా యశ్వంత్, బంటు దేవి, వరప్రసాద్, చింతమల రాములు, గువ్వ వెంకటయ్య, నగేష్, వెంకన్న, శ్యామ్, భాష, జహీర్ తదితరులు పాల్గొన్నారు



