దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్న ప్రభుత్వాలు ;AIYF జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారీ వెంకటేశ్వర్లు
ప్రజాలహరి మిర్యాలగూడ;ప్రభుత్వాలు దేశంలో నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తున్నాయనిAIYF జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారీ వెంకటేశ్వర్లు ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిరియాలగూడెం AIYF 12 వ నియోజకవర్గ మహాసభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంలో పేపర్ల లీకులు అవినీతి ఆరోపణ లు ఎదుర్కొంటున్నారని ఆర్ఎస్ఎస్ బిజెపి విభజన మతతత్వ రాజకీయాల కారణంగా దేశంలో ఆందోళన చెలరేగుతున్నాయని విమర్శించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ పౌరులను కాక్రోచ్ లని సంబోధించి దేశంలోని నిరుద్యోగ యువతను వీధుల్లోకి లాగిందని అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ నుండి చలో పార్లమెంట్ చేపట్టి, పార్లమెంటు గేట్లు మూసి వేసే విధంగా పోరాటం సాగడం గమనర్వం. మోడీ ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విమాన, టెలికం, రక్షణ రంగాలను సైతం ప్రైవేటు పరం చేయటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అవకాశాల కల్పన కోసం నూతన పరిశ్రమలను నెలకొల్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం ఏఐవైఎఫ్ విస్తృత పోరాటాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు స్థానిక పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభకు ఆకారపు లోకేష్ అధ్యక్షత వహించగా మహాసభలో గిరిజన సమైక్య జిల్లా అధ్యక్షులు లింగా నాయక్ సిపిఐ మండల కార్యదర్శులు రామలింగం, యాదగిరి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ నాయకులు పోస్క పరమేష్, జిల్లా యశ్వంత్ ,సత్య, వినయ్ కుమార్, సాయి శరన్, రఫీ, అబ్దుల్ ఖాదర్, కార్తీక్, రాజా, తదితరులు.పాల్గొన్నారు



