మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మువ్వా రామారావు,డాక్టర్ జీవనజ్యోతి…..ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ థియేటర్ ను ప్రజల చెంతకు తీసుకువచ్చిన డాక్టర్ నువ్వా రామారావు…..

(మిర్యాలగూడ ప్రజాలహరి) గుండె జబ్బు బాధితులు గుండెకు సంబంధించిన ఓపెన్ బైపాస్ సర్జరీ ల కోసం ఇక హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు అంతా మిర్యాలగూడలోనే చేయించుకోవచ్చు. ఆరోగ్యశ్రీ ఒంటి ప్రభుత్వ పథకాలు ద్వారా కూడా వైద్యాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన ఘనత డాక్టర్ మువ్వా రామారావు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గత 30 సంవత్సరాల క్రితం అనుముల మండలం చింతగూడెం గ్రామం నుంచి ఉన్నత విద్య వైద్య వృత్తులలో ప్రావీణ్యం సాధించి విద్యను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒక లక్ష్యంతో మిర్యాలగూడలో వచ్చిన డాక్టర్ రామారావు ఏనాడు కూడా ప్రజలను ఇబ్బందులు గురి చేయకుండా స్వల్ప ఖర్చులకు వైద్య సేవలు అందించారు. మిర్యాలగూడకు చెందిన పూర్వపు డాక్టర్లు డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ శరత్ బాబు, డాక్టర్ రాజు, తర్వాత సుదీర్ఘకాలంగా వైద్యవృత్తిలో నేటికీ కొనసాగుతూ ఆధునిక వసతులతో కూడిన నూతన కార్పొరేట్ భవనoను సొంతంగా కలిగి ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ మువ్వా రామారావే అని చెప్పవచ్చు. డాక్టర్ మువ్వరామారావు, డాక్టర్ జీవనజ్యోతి, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్, కార్డియాలజిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ రెడ్డి, కార్డియా అనస్థీషియా & కార్డియాక్ క్రిటికల్ కేర్ డాక్టర్ లావణ్య, డాక్టర్ కృష్ణ చక్ర ఆధ్వర్యంలో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ విజయవంతం అయినది. మిర్యాలగూడ పట్టణంలో జ్యోతి హాస్పిటల్ లో ఇటీవల ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ థియేటర్ అత్యధిక ఆధునిక వైద్య సదుపాయాలతో కూడిన థియేటర్ను నిర్మించారు. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు అందులో భాగంగా ఈనెల 20వ తారీఖున వీర్లపాలెం గ్రామానికి 60 సంవత్సరాలు మహిళకు గుండెకు సంబంధించిన నొప్పితో తన హాస్పిటల్ కు రావడంతో ఆమె పరీక్షలు నిర్వహించి గుండెలో బ్లాకులు మూసుకుపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆమెకు ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ నిర్వహించడం జరిగింది. ఆపరేషన్ విజయవంతం అయింది.వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. సుమారు నాలుగు కోట్ల రూపాయలతో హార్ట్ లంగ్ మిషన్, హీటర్ కూలర్, మైక్రో ఇన్వెస్ట్మెంట్స్, కార్డియా క్రిటికల్ వంటి సౌకర్యాలతో కూడిన ఆధునికమైన థియేటర్ను నిర్మించడం జరిగింది. గతంలో ఓపెన్ బైపాస్ సర్జరీలకు హైదరాబాద్ గుంటూరు విజయవాడ ఒంటి పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అవసరం లేకుండా స్థానికంగానే ఓపెన్ హార్ట్ బైపాస్ చార్జర్ ని చేయించుకోవచ్చు అని జ్యోతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నువ్వారామారావు విలేకరుల సమావేశంలో తెలిపారు . తమ హాస్పటల్ సిబ్బంది మరియు ప్రజలు సహకారంతోనే తమ ఈ సేవలు అందించగలుగుతున్నామని పేర్కొన్నారు డాక్టర్ మువ్వా శ్రీ హర్ష గ్యాస్ట్రో సర్జన్, కార్డియాక్ స్టాప్ విజయలక్ష్మి, సునీల్, సైదులు, లక్ష్మణ్, కార్డియాలజీ సర్జరీ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ డేగా వీటి ,ఆరోగ్య మిత్ర షేక్ బషీరుద్దీన్ కార్డియాలజీ సపోర్ట్ స్టాప్ బాలు ,నాగరాజు, నాగేందర్, పాల్గొన్నారు

You May Have Missed