వాడవాడల భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి

ప్రజాలహరి మిర్యాలగూడ (హరి ప్రసాద్ చీదళ్ళ); గురుపూర్ణిమ వ్యాస పూర్ణిమ గా పేరుపొంది ఈనెల 29న భక్తజనులు అశేషంగా గురుపూజోత్సవం జరుపుకుంటున్నారు పిల్లలు తల్లి తండ్రి తర్వాత గురువే దైవంగా భావించి గురువును పూజించుకోవడం కోసం ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి ఆందోత్సాహాల నడుమ అంగరంగ వైభవంగా పల్లెలు పట్టణాలు తేడా లేకుండా చిన్న పెద్ద వయోభేదం లేకుండా అందరూ పూజించుకునే సుదినాన్ని గురుపూజోత్సవం లేదా గురు పౌర్ణమి అంటారు ఈ గురు పౌర్ణమి రోజున సాధారణంగా సాయి దేవాలయాలు భక్తులతో కళకళలాడుతుంది అదేవిధంగా అవకాశం ఉన్నవారు గౌతమ బుద్ధుని కూడా దర్శించి పూజించుకోవడం ఆనవాయితీ

గురు పౌర్ణమి సందర్భంగా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో కలిగిన కాకాని ఈశ్వరమ్మ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన నాగ దత్త సాయి ఆశ్రమం ఇంతింతై అన్నట్లుగా దినదిన ప్రవర్దమానం చెందుతూ ఈరోజు భక్తులకు కొంగుబంగారమైంది రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ సాయి సాన్నిద్యాన్ని మరింత విస్తరిస్తూ మహా సామ్రాజ్యంగా తులతూగుతుంది ఈరోజు ఉదయాన్నే ఐదు గంటలకు కాకడ హారతి తో మొదలై ఏడు గంటలకు బాబాగారికి పంచామృతంలో వివిధ రకాలో పండ్లరసాలను అభిషేకములు  గావించి అలంకరణ అనంతరము షోడశోపచార పూజ ముగించుకొని ఉదయం 9 గంటల నుండి భజన కార్యక్రమం తదుపరి 11:30 గంటలకు పల్లకి సేవ 12:30 కు బాబాగారికి మధ్యాహ్న హారతి తర్వాత అన్న ప్రసాద వితరణ జరిగి భక్తులకు షిరిడి సాయి విషేశమైన ప్రేమతో కూడిన అనుగ్రహాన్ని కురిపించారు సాయంత్రం 6 గంటల నుండి తడకమళ్ళ బైపాస్ సర్కిల్ నుండి బాబాగారు శోభయాత్రగా బయలుదేరి పట్టణ ప్రజలను ఆనందింపజేశారు ఈ ఆనందం మరి ఎంతో కాలం ఇలాగే ఉండాలని భక్తులు భక్తి శ్రద్ధతో సాయిని కొలుచుకున్నారు కార్యక్రమంలో అధ్యక్షులు గుండా శ్రీనివాస్ మట్టయ్య బొల్లేపల్లి జానకి రాములు శ్రీనివాస్ నాగయ్య రవికుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు

Previous post

మిర్యాలగూడలో ట్రైని ఐపీఎస్ అధికారి కృష్ణారెడ్డి అరెస్టు?????

Next post

మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ మువ్వా రామారావు,డాక్టర్ జీవనజ్యోతి…..ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ థియేటర్ ను ప్రజల చెంతకు తీసుకువచ్చిన డాక్టర్ నువ్వా రామారావు…..

You May Have Missed