మిర్యాలగూడ ఎస్వీ గార్డెన్ లో ఘనంగా గురుపూజోత్సవం
ప్రజాలహరి మిర్యాలగూడ (హరిప్రసాద్ చీదళ్ళ);పట్టణంలోని SV గార్డెన్స్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించిన మిర్యాలగూడ నియోజకవర్గ గురుపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (BLR) పాల్గొన్నారు.ఈ సందర్భంగా BLR మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు, సమాజ నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ RDO రమణ రెడ్డి , మండల MEO సైదా నాయక్ , దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్ర నాగు నాయక్ , శిష్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు మరియు పలువురు పాల్గొన్నారు.



