తెలంగాణ పధ్య, గేయ, నాటకాల, జ్యూరీ మెంబర్గా మిర్యాలగూడ వాసి వాకిటి మధు ఎన్నిక

ప్రజాలహరి మిర్యాలగూడ; తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ పేరిట యువతను ప్రోత్సహిస్తూ మంచి షార్ట్ ఫిల్మ్స్, పాటలు, జానపధ గేయాలు, తక్కువ నిడివి గల రచనా వ్యాసాలను ప్రభుత్వం ఆహ్వానించింది. ఇందులో ఉత్తమంగా ఎన్నుకున్న వారికి అవార్డ్స్ ను అందజేస్తారు. ఇందులో రచనల విభాగానికి తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె శ్రీనివాస్ రెడ్డి గారిని జ్యూరీ చైర్మన్ గా, శ్రీ పొన్నం రవిచంద్ర , శ్రీమతి అయినంపూడి శ్రీ లక్ష్మి, శ్రీ వాకిటి మధు ను జ్యూరీ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. మిర్యాలగూడ పట్టణ ప్రాంతానికి చెందిన వాకిటి మధు ఈనాడు పత్రిక ద్వారా జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అక్కడినుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గా పనిచేశారు. వారు ఎన్నిక సందర్భంగా మిర్యాలగూడ సీనియర్ జర్నలిస్టు చిట్యాల వెంకటరమణారావు, ప్రజాలహరి ఎడిటర్ చిట్యాల శ్రీనివాసరావు, చీదళ్ళ హరిప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు

You May Have Missed