విద్యుత్ సరఫరా, సాగునీటి విడుదలలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్‌ఎస్ భారీ ధర్నా పోలీసుల బారికేడ్లను దాటి లోపలికి వెళ్లేందుకు బీఆర్‌ఎస్ శ్రేణుల యత్నం
ప్రజాలహరి మిర్యాలగూడ: రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ, రెండు పంటలకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు, మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూచనతో, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో గురువారం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో విద్యుత్, సాగునీటి సమస్యలపై బీఆర్‌ఎస్ ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ధర్నా అనంతరం బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీగా పోలీసు బలగాలను మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేసి బీఆర్‌ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ నిలువరించారు.మొదట మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్లాంటు లోపలి కి వెళ్లి సి. ఈ ని కలిసి ఎంత ఉత్పత్తి అవుతుంది తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ .. రైతులకు అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, సాగుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ రైతులకు సరిపడా విద్యుత్ అందడం లేదని ఆరోపించారు. ఆనాడు మా హయంలో అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పామని కాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను ఆంధ్రా వ్యక్తులకు అమ్ముకుంటున్నారని తెలిపారు.. ఈ సందర్భంగా నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇక్కడ 4 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం బొగ్గు సరఫరా చేయకుండా అమ్ముకొని విద్యుత్ ఉత్పాదనలో ఆటంకం కల్పిస్తున్నారని వాపోయారు.. రైతులకు సాగు సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, రెండు పంటలకు అవసరమైన సాగునీటిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదని అన్నారు.రైతుల పంటలు ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్‌ను సక్రమంగా అందించాలని, సాగునీటి విడుదలపై స్పష్టమైన చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి కోటిరెడ్డి, జిల్లా అధ్యక్షులు రామావత్ రవీంద్ర కుమార్ నాయక్,మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే లు కంచర్ల భూపాల్ రెడ్ది,నోముల భగత్, ఫైళ్ళ శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్,ప్రభాకర్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య,తిప్పన విజయసింహ రెడ్డి, రాష్ట్ర నాయకులు పిల్లుట్ల రఘు,నరసింహ రెడ్డి,ఇస్లావాత్ రామచందర్ నాయక్,పల్లె రవి, చింతల వెంకటేశ్వర రెడ్డి,చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి,దుర్గంపూడి నారాయణ రెడ్డి, మందడి సైది రెడ్డి, ఎండి.యూసుఫ్,బైరం సంపత్,ధనావత్ చిట్టిబాబు నాయక్, ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి,వీరకోటి రెడ్డి,అంగోతు హతిరాం నాయక్,నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి,మట్టపల్లి సైదయ్య యాదవ్,పాలుట్ల బాబయ్య, బాలాజీ నాయక్, కుర్ర శ్రీను,ఎండి.ఇలియాస్ ఖాన్, చౌగాని బిక్షం గౌడ్,వేలిచేటి రామకృష్ణ, మరేడ్డి, బండి వెంకటేశ్వర్లు,సోము సైది రెడ్డి,బాల సత్యనరయన, రాయికింది సైదులు,కొనకంచి సత్యనారాయణ,వింజం శ్రీధర్, బారేద్ది అశోక్ రెడ్డి,పాశం నరసింహ రెడ్డి,లావుడి సుధాకర్ నాయక్,సంతోష్ రెడ్డి,శ్రావణ్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్,రామవాత్ వినోద్ నాయక్,మజ్జిగపు సుధాకర్ రెడ్డి, గౌరు శ్రీనివాస్,పెద్దపంగా సైదులు, చలికంటి యాదగిరి,నంద్యాల శ్రీరాం రెడ్డి, ఒగ్గు జానయ్య,గుగులోతు వీరబాబు,యర్రమల్ల దినేష్,ఎండి.షోయబ్, కొండరాపు బ్రదర్స్,రఫీ,బైరం గోపి,భూక్యా రాంబాబు,కొనకంచి శేఖర్, మాతంగి రవి,అనిల్ నాయక్,పునాటి లక్ష్మి నారాయణ,పాచు నాయక్,ధనావత్ వెంకటేశ్వర్లు నాయక్,లావూరి శ్రీను, ధనావత్ శ్రీను నాయక్,గడ్డం వెంకన్న,బాల శంకర్ నాయక్, మాలోతు కిషన్ నాయక్,మస్తాన్ నాయక్,షైక్ మస్తాన్,కోట్యా నాయక్,మారుతి వెంకట్ రెడ్డి, పలసాని రాంరెడ్డి,కందుల నాగిరెడ్డి,హనిమి రెడ్డి, వంకుడోతు రావినదర్ నాయక్, టక్కు రమేష్ నాయక్,మాలవాత్ రవీందర్ నాయక్, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*.



