మిర్యాలగూడలో ఘనంగా ఆర్. కృష్ణయ్య 73వ జన్మదినోత్సవ వేడుకలు
ప్రజాలహరి మిర్యాలగూడ; బీసీ ఉద్యమ నేత, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య 73వ జన్మదినోత్సవ వేడుకలు శనివారం మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మ జ్యోతిబా పూలే భవన్ లో ఘనంగా జరిగాయి. బీసీ జేఏసీ కన్వీనర్ మారం శ్రీనివాస్ ఆదేశాల మేరకు, నిర్వాహకులు కో-కన్వీనర్ దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్, నల్గొండ జిల్లా విద్యార్థి సంఘం నాయకుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ భవన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, జీవోలు తీసుకువచ్చి, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన వ్యక్తి ఆర్. కృష్ణయ్య అని కొనియాడారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం, ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చేనగోని యాదగిరి గౌడ్, బీసీ నాయకులు అంజయ్య చారి, గోపి, నక్క కిరణ్, రాజు, సుమన్, ఈశ్వర్, శరత్, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



