వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజాలహరి మిర్యాలగూడ;మిర్యాలగూడ డివిజన్ అటవీ శాఖ మరియు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు… ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ..RDO రమణా రెడ్డి , మున్సిపల్ ఛైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ , వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ , పాల్గొని మొక్కలు నాటారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.. పచ్చదనం పెంపొందించడంతో పాటు, పట్టణంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మున్సిపాలిటీ, అటవీ శాఖలు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, వాటి పెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు..

You May Have Missed