హాలియాలో ఘనంగా ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం

ప్రజాలహరి హాలియా;19 లో తేదీ బుధవారం రోజు 187 వ ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్బంగా ఉమ్మడి అనుముల మండల ఫోటో & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివ ల్యాబ్ నుండి పెద్ద ఎత్తున నినాదాలతో బైక్ లపై ర్యాలీ నిర్వహించి, ఆ తరువాత హాలియా సెంటర్ లో ఉమ్మడి అనుముల మండల అధ్యక్షులు గుండెబోయిన నాగరాజు కెమెరా సృష్టికర్త చార్లెస్ లూయిస్ డాగురే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించిన తరువాత ఫోటో గ్రాఫర్స్ జెండాని ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నల్లగొండ జిల్లా అధ్యక్షులు పసుపులేటి కృష్ణన్న , అలాగే జిల్లా ఉపాధ్యక్షులు నడ్డి మల్లేష్ , గౌరవ అధ్యక్షులు చవ్వా వెంకట్ రెడ్డి , మరియు ఉమ్మడి అనుముల మండల కోశాధికారి యడవల్లి గురువయ్య , ఉపాధ్యక్షులు గడ్డమీది నాగార్జున , రేఖ శ్రీరామ్ , అనుముల మండల ఫోటోగ్రాఫర్స్ సంజీవ్ రెడ్డి, విజయ్, మురారి సైదులు, ల్యాబ్ చారి, గురజాల మహేష్, ఓంసాయి సందీప్,విక్రమ్, మిన్ను మహేష్, రాకేష్ రెడ్డి, సందీప్, గిరి, శ్రీను, గణేష్, బ్రహ్మం, చిన్ని యాదవ్,మహేష్ చారి, వేంకటేష్ గోపి,ఉమ్మడి అనుమల మండల అధ్యక్షులు గుండెబోయిన నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

You May Have Missed