సాగర్ నీటి విడుదల కై కేంద్రంపై ఒత్తిడి తేవాలి జూలకంటి
సాగర్ నీటి విడుదల కై కేంద్రంపై ఒత్తిడి తేవాలి జూలకంటి
సాగర్ నీటి విడుదల కై కేంద్రంపై ఒత్తిడి తేవాలి
ప్రజాలహరి మిర్యాలగూడ;సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూ లకంటి. కృష్ణానది ఎగువ ప్రాంతాలలో ఉన్న ప్రాజెక్టులలో నీరు వచ్చి చేరుతున్నాయని ఆ క్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలకై కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి తేవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామ పరిధిలోని గద్దగూడ తండాలో జాతీయ రైతు సంఘం మహాసభల గురించి రైతులకు వివరించారు. జాతీయ మహాసభ జయప్రదానికి రైతులు స్వచ్ఛందంగా స్పందించటం జరిగింది. ఈ సందర్భంగా నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రయత్నాలు చేయాలని చెరువులు కుంటలు నింపి భూ గర్భ జలాలు పెరిగేటట్లుగా చూడాలని రైతులు జూలకంటిని కోరినారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఆల్మట్టి జూరాల నారాయణపూర్ ప్రాజెక్టులు నిండి నాయి అని ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్నందువల్ల నీరు వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సి డబ్ల్యూ సి లో ప్రభుత్వానికి రావాల్సిన నీటి వాటాను రాబట్టేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ఆయకట్టు ప్రాంతంలో బోర్ల కింద భావుల కింద వరి సేద్యం జరుగుతుందని ఈ క్రమంలో చెరువుల్లోని నీరు తగ్గి భూగర్భ జలాలు అడుగంటే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. అందుకే సాగర్ నీటితో చెరువులు కుంటలు నింపి రైతులను ఆదుకోవాలని అధికారులు ఆ మేరకు సూచనలు చేయాలని ఆయన కోరారు. ఎల్నినో ప్రభావం వచ్చే సంవత్సరం కూడా ఉంటుందని అందుకే సాగుకు నీటిని విడుదల చేయకుండా మంచినీటి కొరకు వినియోగిస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసిందని వారన్నారు. నీటి కోసం రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమాలకు రైతులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రమంలో నల్లగొండ పట్టణంలో జరిగే జాతీయ రైతు మహాసభలకు రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు రవి నాయక్ గ్రామస్తులు ఉన్నారు.


