విశిష్ట సేవలకు గుర్తింపుగా మిర్యాలగూడ తహసిల్దార్ శ్రీనివాస్
ప్రజాలహరి మిర్యాలగూడ;నల్గొండ కలెక్టరేట్లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విశిష్ట సేవలకు గుర్తింపుగా అవార్డు అందుకున్న మిర్యాలగూడ తహసీల్దార్ శ్రీ పి.శ్రీనివాస్ గారికి ప్రజాలహరి తరపున హృదయ పూర్వక అభినందనలు . ప్రజలకు చేరువగా ఉంటూ రెవెన్యూ సేవలను సమర్థవంతంగా అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో చూపిన కృషికి ఈ పురస్కారం దక్కడం అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శుభాకాంక్షలు తెలియజేస్తోంది.



