వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR
ప్రజాలహరి మిర్యాలగూడ;రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, జలాశయాలు, చెరువులు నిండి, పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఈరోజు నాగార్జునసాగర్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ యాగం లో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ కుందూరు జానారెడ్డి , ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు, చెరువులు పూర్తిస్థాయిలో నిండి సాగు మరియు తాగునీటి అవసరాలు తీరాలని, రైతులు పండించిన పంటలకు మంచి దిగుబడులు రావాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు ఆనందంగా ఉండాలని, ప్రతి గ్రామం పచ్చదనంతో కళకళలాడాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు…



