వి ఏ ఓ సరితపై చర్యలు తీసుకోవాలి అని మహిళలు ధర్నా
కేంద్రంలోని వెలుగు ఆఫీస్ కు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలు
వివోఏ సరితకు కొమ్ముకాస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మహిళా సంఘం లీడర్లు
వేములపల్లి ఏప్రిల్ 2 ప్రజల హరి
లక్ష్మీదేవి గూడెం వివోఏ కు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీదేవి గూడెం మహిళా సంఘం లీడర్లు అధికారులను కోరారు. గురువారం మండల కేంద్రంలోని వెలుగు ఆఫీస్ కు తాళం వేసి అధికారులు నిర్బంధించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు నెలల సంధి అవినీతికి పాల్పడుతున్న ముత్యాల సరిత వివో ఏ ను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మా గోడును వినకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ని కలవడానికి మేము వెళ్తే లీడర్లు లేకుండానే వివోఏ గా సరితను ఎన్నుకున్నట్లు తీర్మానాన్ని రూపొందించారు. అధికార పార్టీకి చెందిన సరితకు స్థానిక సర్పంచ్ భరత్ ,వెలుగు ఎంప్లాయ్ సిసి గోపి అండగా ఉంటూ మహిళా సంఘాలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఎంపీడీవో జితేందర్ రెడ్డి వచ్చి మహిళలకు వచ్చే సోమవారం రోజున మహిళా సంఘాలకు మీటింగ్ పెట్టి ఓటింగ్ పద్ధతిలోనే వివోఏను తొలగించి తీర్మానం చేస్తారని సర్ది చెప్పడంతో తాళం తీశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం లీడర్లు సభ్యులు పాల్గొన్నారు



