పద్య నాటక రంగంలో దేశం గర్వించే లాగా దూసుకుపోతున్న మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం
నాటక రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ…ఢిల్లీకి చేరిన మిర్యాలగూడ ఖ్యాతి
–మిర్యాలగూడ,
ప్రజాలహరి
“చెరిగిపోని చిరునామ” సాంఘిక నాటిక హర్ష క్రియేషన్స్, విజయవాడ
“నీళ్ళు నీళ్ళు” సాంఘిక నాటిక నటరాజ డ్రమటిక అసోసియేషన్, పెందుర్తి, విశాఖపట్నం
“వివాహ బంధం” సాంఘిక నాటిక మయూరి ఆర్ట్స్ క్రియేషన్స్, వరంగల్.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న నందినీ అవార్డ్స్ 2026 జాతీయస్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు మరియు నృత్యోత్సవాలు నాల్గవ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్తలు కర్నాటి రమేష్ బండారు కుశలయ్య గొల్ల రామశేఖర్ లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నాటక రంగంలో దినదినాభివృద్ధి చెందుతూ…ఢిల్లీకి చేరిన మిర్యాలగూడ ఖ్యాతి దీనికి విశేష కృషి చేస్తున్న మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు సెక్రటరీ పులి కృష్ణమూర్తి శర్మ కోశాధికారి పుల్లాభట్ల లక్ష్మీనారాయణ శర్మ శ్రమ వెలకట్టలేనిదన్నారు. మిర్యాలగూడకు ఇంతటి ఖ్యాతిని అందించిన కళాకారులకు ఏమిచ్చినా తక్కువే అవుతుంది రేపటి తరానికి ఈ నాటికలు కనుమరుగు కాకుండా ఉచిత నటనకు సంబంధించిన తరగతులు ప్రారంభించాలని అందుకు మా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ముందుగా పాటల పోటీలను నిర్వహించి అనంతరం నాటికల ప్రదర్శన నిర్వహించారు. నాటికల అనంతరం నటీనటులకు.. నిర్వాహకులకు పారితోషకంతో పాటు షీల్డ్లు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు,అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకటలక్ష్మీనారాయణ శర్మ, సాయిలు, సత్యనారాయణ చారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శ్రీమతి శైలజ, సరస్వతి, శ్రీమతి నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.



