అలరిస్తున్న జాతీయస్థాయి పద్య నాటికలు నృత్య ప్రదర్శనలు

సమస్యలకు…సవాళ్లకు పరిష్కారం ఈ నాటికలు

—–+—-++——++++—-

మిర్యాలగూడ ప్రజాలహరి

తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ మరియు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్.. మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం మిర్యాలగూడ కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న నందినీ అవార్డ్స్ 2026 జాతీయస్థాయి పద్య నాటక సాంఘిక నాటక పోటీలు మరియు నృత్యోత్సవాలు రెండవ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త జయిని మురళి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిసోర్స్ రిటైర్డ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నూకల జగదీశ్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ నాటిక, నాటకాలు నేడు సమాజంలో పెచ్చరిల్లుతున్న వివిధ ధోరణులను కళ్లకు కట్టాయి. ఆయా సమస్యలను, సవాళ్లనూ ప్రతిభావంతంగా చర్చించి, పరిష్కారాలను కూడా సూచించాయన్నారు.

 

మొదటగా సిరిమువ్వ నాట్యమండలి మిర్యాలగూడ మాస్టారు రాము, అభినయ రుద్రనాట్యమండలి ఖమ్మం మాస్టారు ఫణి కుమార్ సంయుక్తంగా చిన్నారులచే నృత్య ప్రదర్శన నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అతిధులచే షీల్డ్లు , సర్టిఫికెట్లను అందజేశారు.

 

1) “ఎవరు” సాంఘిక నాటిక

అద్దెపల్లి, ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి, గుంటూరు…

 

2) “తరమెల్లి పోతున్నది” సాంఘిక నాటిక

శ్రీకరణం సురేష్ మెమోరియల్ థియేటర్, గుంటూరు…

 

3) “ఇంద్రప్రస్థం” సాంఘిక నాటిక అభినయ ఆర్ట్స్ గుంటూరు వారిచే ప్రదర్శించడం జరిగింది.

 

ప్రదర్శన అనంతరం నాటిక లో పాల్గొన్న నటీనటులకు ప్రోత్సాహక బహుమతులతో పాటు షీల్డ్లను అందజేశారు.

 

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తడకమళ్ళ రామచంద్రరావు,అధ్యక్షులు రామావతారం, ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి శర్మ, కోశాధికారి వెంకటలక్ష్మీనారాయణ శర్మ, సాయిలు, సత్యనారాయణ చారి, లక్ష్మయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, శ్రీనివాసరావు, రాఘవయ్య, శ్రీమతి శైలజ, సరస్వతి, శ్రీమతి నాగమణి, ఉపేందర్, బాబురావు, వీరప్రతాప్, టంగుటూరి రాజారాం తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed