బస్ కిందపడి మహిళా మృతి
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ బస్టాండ్ లో దేవరకొండ డిపో బస్సు ఢీకొని గిరిజన మహిళ మృతి
దేవరకొండ డిపో నుండి సాయంత్రం సుమారు నాలుగున్నర గంటల సమయంలో మిర్యాలగూడ కొచ్చి తిరిగి దేవరకొండ వెళుతున్న క్రమంలో బస్సును బస్టాండ్లో నిలుపుదల చేసేందుకు వస్తుండగా స్థానిక జటావత్ తండాకు చెందిన గిరిజన మహిళ రమావత్ విజయ కుమారున్ని బస్సు ఎక్కించి తను బస్సు ఎక్కే క్రమంలో డ్రైవర్ నిర్లక్ష్యంగా కదిలించడం వల్ల సదరు మహిళ బస్సు కిందపడి తలకు గాయమై నడుము విరిగి అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఆర్టీసీ సిబ్బంది హుటా హుటును మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు తల్లి వద్ద కుమారుడు రోధించే సందర్భాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారుటూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు


