జాతీయస్థాయి నంది నాటక ఉత్సవాలను ప్రారంభించిన శాసలమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని మినీ రవీంద్ర భారతి నందు *తెలంగాణ రాష్ట్ర బాషా సాంస్కృతిక శాఖ మరియు మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం* ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. *జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటిక పోటీలు*కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ *గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి MLC *శంకర్ నాయక్ మున్సిపల్ చైర్మన్ *చిలుకూరి సుధా బాలకృష్ణవైస్ చైర్మన్ *గుడిపాటి శిరీష  పాల్గొన్నారు… ఈ కార్యక్రమం ప్రారభించిన అనంతరం తడకమళ్ళ రాంచంధర్ రావు రచించిన పద్య నాటకాల పుస్తకాలను ఆవిష్కరించారు… ఈ సందర్భంగా *MLA – మాట్లాడుతూ

మన ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నంది నాటకోత్సవాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది…తెలుగు సంస్కృతికి, భాషకు నాటక రంగం వెన్నెముక వంటిది. ఒకప్పుడు సామాజిక మార్పు కోసం నాటకాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించారు…

ఈరోజు సాంకేతికత పెరిగినప్పటికీ, ప్రత్యక్షంగా వేదికపై కళాకారులు ప్రదర్శించే నాటకానికి ఉండే ప్రాధాన్యత తగ్గలేదు… పౌరాణిక, చారిత్రక మరియు సాంఘిక నాటకాల ద్వారా మన విలువలను చాటిచెబుతున్న కళాకారులందరికీ నా అభినందనలు. మన ప్రభుత్వం కళలను మరియు కళాకారులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ నాటకోత్సవాలు విజయవంతం కావాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మిర్యాలగూడ సాంస్కృతిక కళా కేంద్రం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ..

అలాగే ఈ కళా భారతికి పునాదులు వేసిన స్వర్గీయలు జైపాల్ పాల్ రెడ్డి ని స్మరించుకున్నారు.. అలాగే ఈ కళా భారతి నిర్మాణం పూర్తవడానికి కీలక పాత్ర పోషించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కళాకారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

You May Have Missed