వేదొక్త పూజల అనంతరం శ్రీ చక్ర కనకదుర్గ అమ్మవారి పునర్ దర్శనం, నిత్య పూజలు

త్వరలో కనకదుర్గ గుడి పున : ప్రారంభం

కమిటీ చైర్మన్ బద్దం

వేములపల్లి( ప్రజాలహరి ) నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడిని త్వరలో పున ప్రారంభించనున్నట్టు గుడి చైర్మన్ బద్దం సరిత తెలిపారు. శుక్రవారం కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2004 సంవత్సరంలో ఇట్టి గుడిని ఏర్పాటు చేయడం జరిగింది అట్టి గుడిలో శివపార్వతుల విగ్రహం 2013 అక్టోబర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం కొన్ని అనివార్య కారణాలవల్ల గుడి మూతపడడం జరిగింది ఇట్టి గుడిని త్వరలో గ్రామ పెద్దల సమక్షంలో మాట్లాడి వేద పండితుల పిలిపించి తిరిగి మళ్లీ పున ప్రారంభించనున్నట్టుగా ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వెంట వేములపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, ప్రస్తుత నూతన సర్పంచి పుట్టల సందీప్, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు, తదితరులు పాల్గొన్నారు

You May Have Missed