వేములపల్లి శ్రీ కనకదుర్గ దేవాలయ ఆవరణలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించిన గ్రామ మహిళలు
శ్రీ కనకదుర్గ దేవాలయం ఆవరణలో పరిసరాలను పరిశుభ్రం చేసిన మహిళలు, గ్రామ ప్రజలు….
వేములపల్లి( ప్రజాలహరి ) నల్గొండ జిల్లా వేములపల్లి మండలంశ్రీ కనకదుర్గ దేవాలయ ఆవరణలో కుల మతాలకు ఆతీతంగా బుధవారం గ్రామ మహిళలు దేవాలయ ప్రాంగణమును శుభ్రపరచడం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కనకదుర్గమ్మ దేవాలయం ధూప, దీప నైవేద్యాలకు దూరంలో ఉండడంతో ఈ దేవాలయ ఆవరణలో చెత్తాచెదారాలతో పేరుకుపోయి ఉండటంతో దేవాలయం మూతపడి ఉండడంతో గ్రామానికి మంచిది కాదని భావించి గ్రామంలోని మహిళలు ఈ దేవాలయం తక్షణమే శుద్ధి చేస్తే బావుంది గ్రామంలోని భక్తులు ప్రతివారం వచ్చి ధూప దీప నైవేద్యాలని పెట్టుకొని పూజలు నిర్వహించుకుంటారని ఇట్టి ఆలయంలో ఉన్నటువంటి చెత్త చెదారం తొలగించడం జరిగింది. అంతేకాకుండా నిన్న అనగా మంగళవారం గ్రహం ఉన్నందున అట్టి చెత్త చెదారం తొలగించి దేవాలయాన్ని మంచినీరుతో శుభ్రం చేయడం జరిగినది. నేటి నుంచి భక్తులు ఎల్లవేళల పై కొబ్బరికాయలు కొట్టుకొని పూజలు నిర్వహించుకునేలా చూడాలని పలువురు కోరుతున్నారు .



