శ్రీ సరస్వతి శిశుమందిర్ లో పలువురుని అలరించిన అంతరిక్ష గెలాక్సీ సో
శ్రీ సరస్వతి శిశు మందిర్ లో అబ్బురపరిచిన గెలాక్సీ షో
— అంతరిక్ష అనుభూతిని పొందిన విద్యార్థులు
మిర్యాలగూడ : ప్రజాలహరి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ లో సోమవారం ఇన్ఫినిటీ ఆర్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంతరిక్ష గెలాక్సీ షోను ఏర్పాటు చేశారు. అంతరిక్షంలోని గ్రహాలు, ఉపగ్రహాలు పరిభ్రమణ విధానాన్ని ప్రత్యక్ష పద్ధతిలో చూపెట్టడంతోపాటు మానవ జీవన పరిణామ సిద్ధాంతాన్ని క్రమానుగతంగా దృశ్య రూపంలో ఆవిష్కరించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అంతరిక్ష రహస్యాలను ఈ గెలాక్సీ షో ద్వారా విద్యార్థులు చక్కటి అనుభూతి పొందినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నూరు రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ఇన్ఫినిటీ మెంబర్ కిరణ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.



