మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన ఆర్యవైశ్యులను సన్మానించిన భార్గవ్

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం మిర్యాలగూడ ఆర్యవైశ్యులు పట్టణ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించి 2026 ఫిబ్రవరిలో ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు మరియు గెలిచిన అభ్యర్థులకు సంబంధించి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది ముఖ్య అతిథిగా చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత , గుడిపాటి నవీన్  మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్, మరియు తెడ్ల జవహర్ బాబు , బండారు కుషలయ్య , రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ , పాల్గొని ఆర్యవైశ్యుల గురించి తమవంతు సందేశాన్ని తెలియజేస్తూ ఆర్యవైశ్యుల ఐక్యతను కొనియాడడం జరిగింది.

గౌరు శ్రీనివాస్  మాట్లాడుతూ మిర్యాలగూడ గ్రామపంచాయతీ స్థాయి నుంచి కూడా వివిధ కేడర్ల నుండి గెలుపొందినటువంటి మరియు అభివృద్ధిని చవిచూపించినటువంటి తిరునగరు వారి గురించి కొనియాడుతూ గత పాలకవర్గం యొక్క విశేషాలను తెలియజేశారు

బండారు కుశలయ్య  మాట్లాడుతూ ఎలక్షన్లలో పోటీ చేసే సందర్భంలో కానీ మరో సందర్భంలో గానీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లకు సంబంధించి కేటాయించిన సందర్భాల్లో ఓసీలు దాంట్లో పాలుపంచుకోలేనీ పరిస్థితిని కొనియాడారు మరియు ఓసీలకు కేటాయించిన సందర్భంలో ఎస్సీ ఎస్టీలు పోటీ చేయవచ్చును మరియు చేస్తున్నారు అని తెలిపారు. పందిరి రవీందర్ సార్ మాట్లాడుతూ ఆర్యవైశ్య ఐక్యత కలిగిన ఈ సమూహాన్ని చూస్తే కనుల పండువగా ఉందని మనకున్నటువంటి ధర్మాన్ని తెలియచేస్తూ గుర్తుచేస్తూ ఆర్యవైశ్యులులో ఉత్తేజాన్ని రేకెత్తించారు. అధికారంలో ఉన్న ఆర్యవైశ్యులు ఉత్తమముగా ఎదగడమే కాకుండా మిగతా వాళ్ళను కూడా తమ స్థాయికి తీసుకురావాలని వారి యొక్క బాధ్యతలను గుర్తుచేస్తూ ఉత్సాహాన్ని నింపిన రవీందర్ సార్ గారికి కరతాళ ధ్వనులు వినిపించాయి

తెడ్ల జవహార్ బాబు  మాట్లాడుతూ ఆర్యవైశ్య కమ్యూనిటీలు వివిధ హోదాలలో ఉన్నవారు ఎవరికి ఏ సమస్య ఉన్న వారైనా కలిసికట్టుగా వచ్చి సమస్యను సాధించుకోవాలని తెలియజేశారు

కర్నాటి రమేష్  మాట్లాడుతూ గెలిచిన అభ్యర్థులు వారి యొక్క కృషిని కొనియాడారు గెలిచిన వారికి శుభాభినందనలు తెలియజేశారు. వచ్చిన గెలుపు ఉచితంగా రాలేదని 12 రోజుల నిర్విరామ రెయింబవళ్ళు కృషి వల్ల వచ్చిందని గుర్తు చేశారు ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్యులు హాజరై జయప్రదం చేశారు

You May Have Missed