శిష్య స్కూల్లో సైన్స్ ఫెయిర్
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
స మిర్యాలగూడ రామచంద్ర గూడెం పరిధిలో చైతన్య నగర్ లో గల శిష్య స్కూల్లో నిన్నటి రోజున జరిగిన సైన్స్ ఫెయిర్ లో భాగంగా విద్యార్థులు అనేక రకాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి
మాట్లాడుతూ సర్ సివి రామన్ వైజ్ఞానిక రంగంలో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతిని గ్రహించిన వ్యక్తిగా తనను ఆదర్శంగా మనం తీసుకోవాలని విద్యార్థులు ఇటువంటి వైజ్ఞానిక రంగంలో అనేక విధాలైన పరీక్ష లు నిర్వహించి సైంటిస్టులుగా దేశానికి సేవ చేయాలని కోరారు. ప్రిన్సిపల్ అలుగుబెల్లి శిరీష గారు మాట్లాడుతూ విద్యార్థులు అనేక శిఖరాలను అధిరోహించి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను మరెన్నో చేపట్టాలని ఈ సమాజానికి విద్యార్థుల అవసరం ఎంతైనా ఉన్నదని తమలో ఉన్న ప్రతిభను చాటి చెప్పాలని వెలికితీయాలని విద్యార్థులను ప్రశంసించారు కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రముఖులు పాల్గొన్నారు



