మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా… చిలుకూరి సుధా
మిర్యాలగూడ ప్రజాలహరి.. మిర్యాలగూడ పరిధిలోని అన్ని వార్డులలో సమస్యలను దామాషా పద్ధతిలో పరిష్కరించుకుంటూ వస్తానని నూతనంగా ఎన్నికైన చైర్మన్ చిలుకూరి సుధా పేర్కొన్నారు. ఈరోజు మొదటిసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో సభ్యులను సభకు పరిచయం చేశారు .అనంతరం చైర్మన్ మాట్లాడుతూ శాఖల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాలు చేపట్టబోయే కార్యక్రమాలు వివరాలను ఒక రికార్డు తయారు చేయాలని అధికారులకు వారు సూచించారు.. ముఖ్యంగా వేసవి వస్తున్న దృష్టి వాటర్ ట్యాంకులు పరిశుభ్రపరచటం వార్డులలో నీటి సమస్య లేకుండా అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముందే సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష, కమిషనర్ జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు



