కాంగ్రెస్ మాయలో పడొద్దు సిద్ధార్థ

బీఆర్ఎస్ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించాలి

* భార్యకు బస్సు ఫ్రీ ఇచ్చి.. భర్తకు డబుల్‌ టికెట్‌ ఇచ్చిన రేవంత్ సర్కార్

* కాంగ్రెస్ మాయలో పడొద్దు….మరోసారి నమ్మితే గోసపడతారు

* ప్రతీ ఒక్కరూ 11న ఓటు హక్కును వినియోగించుకోవాలి

* 6, 7, 21,39 వార్డుల్లో ప్రచారంలో పాల్గొన్న నల్లమోతు సిద్దార్థ

 

మిర్యాలగూడ ప్రజాలహరి

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో గెలిపించాలని మిర్యాలగూడ పట్టణ ప్రజలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్థ అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 6, 7, 21,39 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమోతు సిద్దార్థ మాట్లాడారు. అబద్ధపు హామీలతో ప్రజలను వంచించి గద్దెను ఎక్కిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. రేవంత్ పాలనలో కేసీఆర్ అమలు చేసిన పథకాలన్నీ బంద్ అయ్యాయని విమర్శించారు. ప్రజలు

కాంగ్రెస్ మాయలో పడొద్దు….మరోసారి నమ్మితే గోసపడతారని అన్నారు. రెండున్నరేళ్లలో ప్రజా సంక్షేమానికి తూట్లు పొడవడం తప్ప రేవంత్‌ సర్కార్‌ చేసిందేమీ లేదని విమర్శించారు. భార్యకు బస్సు ఫ్రీ ఇచ్చి.. భర్తకు డబుల్‌ టికెట్‌ ఇచ్చాడని అన్నారు. ఏం మంచి పని చేశారని కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయమని అడుగుతారని ప్రశ్నించారు. రేవంత్‌ నోటి వెంట బూతులు తప్ప మంచిమాటలు రావడం లేదని మండిపడ్డారు. రూ.4వేల పింఛన్‌ ఇవ్వలేదు.. ఒక్కొక్కరికీ రూ.52వేలు బాకీ పడ్డారని అన్నారు. అవ్వాతాతలు మీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు రూ.52 వేలు ఇవ్వాలని నిలదీయాలని సూచించారు.బీఆర్ఎస్ హయాంలో బిడ్డ పుడితే రూ.13 వేలు ఇచ్చి అంబులెన్స్‌లో జాగ్రత్తగా ఇళ్ల వద్ద దించామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మీ కింద ఆడబిడ్డల పెళ్లి రూ.లక్ష ఇచ్చామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పిండని.. ఇంతవరకూ ఇచ్చిండా అని ప్రశ్నించారు. ఏ ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అని నిలదీశారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గోసపడదామా అని ప్రశ్నించారు. గొర్రె పిల్లల పథకం, చేప పిల్లల పథకం బంద్‌ అయ్యిందని చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ బంద్‌.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బంద్‌ అయ్యిందని అన్నారు. కేసీఆర్‌ పథకాలన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి బంద్‌ పెడుతున్నాడని తెలిపారు. అన్ని పథకాలు బంద్‌ పెట్టి గోసపెడుతున్న రేవంత్‌కు ఓట్లేద్దామా అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు బట్టేబాజ్‌ మాట్లాడుతుండ్రు అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక స్పెషల్‌ ప్యాకేజీ తెచ్చి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ హయాంలో మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చి అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. బస్తీ దవాఖానాలు, వీధిలైట్లు, రోడ్లు, పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. లాగుల తొండలు వదులుతా.. పేగులు తీసి మెడలో వేసుకుంట.. గుడ్లు పీకి గోటీలాడుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇలాంటి భాషనా ఓ ముఖ్యమంత్రి మాట్లాడేదని నల్లమోతు సిద్దార్థ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలను మోసం చేసిండని మాట్లాడారు. ఏ ఒక్కరినీ వదలకుండా అన్ని వర్గాలనూ మోసం చేసిండని మండిపడ్డారు. డిక్లరేషన్లు మరిచిపోయిండు అని.. బూతుల డిక్లరేషన్లు చేసిండని తెలిపారు. ఈ బూతుల ముఖ్యమంత్రిని ఓటుతో గట్టి బుద్ధి చెప్పాలని సూచించారు. చెత్త మాటలు వద్దు.. అభివృద్ధి కావాలంటూ ఓటుతో తెలియజెప్పాలన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని పదేండ్ల లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత నల్లమోతు భాస్కర్ రావు కే దక్కుతుందన్నారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు, మిత్రపక్షాలు బలపర్చిన బంపర్ మెజారిటీతో గెలిపించాలని నల్లమోతు సిద్దార్థ కోరారు

You May Have Missed