విద్యార్థులు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి

* పబ్లిక్ పరీక్షలకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలి

* సమాజసేవలో పాల్గొనేందుకు యువత ముందుకు రావాలి

* ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో 10/10 గ్రేడ్ సాధించిన ప్రతి విద్యార్థికి రూ.2000 నగదు పారితోషికం, మెమెంటో, పతకం అందజేస్తాం

* లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ లో పరీక్షా ప్యాడ్లు, పెన్నులు పంపిణీ : హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్

మిర్యాలగూడ ప్రజాలహరి…

#విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో తమ స్థైర్యాన్ని కోల్పోవద్దని ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్, హ్యూమన్ రైట్స్ డిఫెండర్ హమీద్ షేక్ కోరారు. తాను నిర్వర్తిస్తున్న కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని యువత, తన మిత్రబృందం సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ లో తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఊర్మిళ రాణి పాత్రో

అభ్యర్ధన మేరకు, ఆర్ధిక సహకారంతో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ కె.కె. జయరాజన్, హెడ్ మాస్టర్ సుజయ్ తో కలిసి ఆయన నిర్వహించారు. అనంతరం హమీద్ షేక్ మాట్లాడారు. పబ్లిక్ పరీక్షలు ఆసన్నమవుతున్న నేపథ్యంలో విద్యార్థులంతా ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు హాజరయ్యేందుకు సన్నద్ధం కావాలని కోరారు. విద్యార్థులంతా మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలని, ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాలను చదువుకోవాలని సూచించారు. నిరంతర ప్రక్రియగా తరగతిలో నేర్చుకున్న అంశాలపై పునశ్చరణ చేపట్టాలని కోరారు. సంబంధిత విషయానికి సంబంధించిన ఉపాధ్యాయుల మార్గదర్శనం తీసుకొని పబ్లిక్ పరీక్షల్లో అద్భుత ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులంతా మోడల్ ప్రశ్న పత్రాలను పునఃశ్చరణ చేసుకోవాలని కోరారు. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన సూక్తిని విద్యార్థులంతా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని హామీద్ షేక్ తెలిపారు. ఈ ఏడాది ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో 10/10 గ్రేడ్ సాధించిన ప్రతి లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థికి తమ సంస్థ ద్వారా రూ.2000 నగదు పారితోషికం, మెమెంటో, పతకం చొప్పున అందజేయనున్నట్టు హమీద్ షేక్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

You May Have Missed